కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథలనే ఎంచుకుంటున్న నిఖిల్

కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథలనే ఎంచుకుంటున్న నిఖిల్

టాలెంటెడ్ హీరో నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్… ఈ చిత్రం కూడా అలాగే ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందట. హీరో పాత్ర ఆ సమస్యతోనే విలన్స్ ను ఎలా ఎదురుకున్నాడు అనే కోణంలో సినిమా సాగుతుందట.

ఇప్పటికే ఈ ఫార్ములా మీద తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చినా ఈ కథ కొత్తగా ఉంటుందట. అంతేకాదు ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.