ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఒకే స్క్రీన్ పై చూడలంటున్న అభిమానులు

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఒకే స్క్రీన్ పై చూడలంటున్న అభిమానులు

బాలీవుడ్ మరియు ఇతర పరిశ్రమలలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడం తరుచుగా చూస్తూ ఉంటాం. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు అలా కాదు, ఇమేజ్, స్క్రీన్ స్పేస్, ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే అనేక విషయాలు అడ్డు వస్తాయి. ఐతే కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది, స్టార్ హీరోల మధ్య మల్టీ స్టారర్ లు చిన్నగా ఊపందుకుంటున్నాయి. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరోలు చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఇందుకు నిదర్శనం. వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తారని కలలో కూడా ఎవరు ఉహించి వుండరు. ఆర్ ఆర్ ఆర్ తో దర్శకుడు రాజమౌళి దానిని సాధ్యం చేశాడు.

అలాగే మహేష్పవన్ కలిసి మల్టీ స్టారర్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఆ మధ్య రాజకీయాల వైపు మళ్ళిన పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ప్రకటించడంతో… ఇది ఎప్పటికీ కుదరని కాంబినేషన్ అని అందరూ అనుకున్నారు. ఐతే పవన్ ఈ ఏడాది సినిమాలలోకి కంబ్యాక్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పై మళ్ళీ హోప్స్ పెరిగాయి. దీనికి తోడు మహేష్ మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కుదిరితే వీరిని ఒప్పించడం అంత కష్టం ఏమి కాదు.