Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్లో నితీష్ కుమార్ మోడీకి దగ్గరవుతున్నారు. పైకి లాలూపై అవినీతి ఆరోపణలు సాకు చెబుతున్నా.. అవి ఇపటివి కాదు రెండు దశాబ్దాల నాటివి. ఎన్నికల్లో తన అవసరం కోసం లాలూతో జత కట్టిన నితీష్.. ఇప్పుడు అవినీతి సాకు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరని నితీష్ చెబుతున్నారట.
డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో సర్కారు పరువు పోయిందని నితీష్ భావిస్తున్నారు. ఏ క్లీన్ ఇమేజ్ ఇప్పటిదాకా శ్రీరామరక్షగా ఉందో.. ఇప్పుడు అదే లేకుండా పోతే.. ఎలాగని నితీష్ వాపోతున్నారట. లాలూతో ఎక్కువకాలం ఉండలేమని, అవసరమైతే ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. బీజేపీతో దోస్తీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కానీ బీహార్ తరహాలో మరిన్ని రాష్ట్రాల్లో మహాకూటముల ఏర్పాటుకు ట్రై చేస్తున్న కాంగ్రెస్ మాత్రం.. నితీష్, లాలూను కలిపి ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కలిసి ఉండాలంటే.. తేజస్వి రిజైన్ చేయాలని చెప్పేశారట నితీష్. సోనియాకు కూడా ఈ విషయం స్పష్టం చేయడంతో.. ఆమె లాలూకు నచ్చజెబుతున్నారు. కానీ లాలూ మాత్రం ఇగోను త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు.