కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు గడ్కరీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, హోం క్యారంటైన్లో ఉన్నానని ట్విట్టర్లో తెలిపారు. ఈ క్రమంలో ఆయన తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. ఆయనకు గతేడాది 2021 సెప్టెంబర్లో కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.
పైగా ఈ కరోనా మూడోవేవ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ ఉపాధ్యక్షుడు రాధా మోహన్ సింగ్ వంటి పలువురు పార్టీ సహోద్యోగుల తోపాటు నితిన్ గడ్కరీ కూడా ఈ కరోనా మహమ్మారి భారిన పడ్డారు. ఇటీవలే కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే కూడా తనకు కరోనా వచ్చిందని, అయితే తాను ఇప్పడూ పూర్తిగా కోలుకున్నాని తెలియజేసిన సంగతి విధితమే.