నివేదా థామస్‌కు ఏమైంది?

Nivetha Thomas Rejected Movie Offiers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నానికి జోడీగా ‘జెంటిల్‌మన్‌’ మరియు ‘నిన్ను కోరి’ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ ఎన్టీఆర్‌తో ‘జైలవకుశ’ చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. మూడు చిత్రాలు కూడా నివేదా థామస్‌కు మంచి సక్సెస్‌లను అందించాడు. మూడు చిత్రాలతో నివేదా థామస్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది. దాంతో ఆమెతో నటించేందుకు యువ స్టార్‌ హీరోలు మరియు చిన్న హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. కాని నివేదా థామస్‌ మాత్రం ప్రస్తుతానికి సినిమాలకు ఓకే చెప్పడం లేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె ప్రస్తుతానికి సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదు. పారితోషికం భారీగా ఇస్తాను అంటూ ఇటీవల ఒక నిర్మాత ఆమె వద్దకు వెళ్లినా కూడా నిర్మొహమాటంగా సారీ చెప్పిందని సమాచారం అందుతుంది.

nivetha thomas

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రం కోసం నివేదా థామస్‌ను ఎంపిక చేయాలని ప్రయత్నించారు. అందుకోసం ఆమెను సంప్రదించారు. కథ వినేందుకు ఆమె నిరాకరించింది. ప్రస్తుతానికి తాను సినిమాలు ఏమీ చేయదల్చుకోవడం లేదు అంటూ నిర్మాతతో చెప్పినట్లుగా తెలుస్తోంది. మూడు వరుస విజయాలతో ఏ హీరోయిన్‌ అయిన తన పారితోషికాన్ని అమాంతం పెంచేసి వరుసగా చిత్రాలు చేస్తారు. కాని నివేదా థామస్‌ మాత్రం ఎందుకు ఇలా చేస్తోందో అంటూ సినీ వర్గాల వారు ఆశ్చర్య పోతున్నారు.

nivetha-thomas-rejected-mov

ఇప్పటి వరకు నివేదా థామస్‌ మూడు నాలుగు సినిమాలకు నో చెప్పింది. అంటే కనీసం మూడు కోట్ల రూపాయల పారితోషికాన్ని ఆమె కాదనుకున్నట్లే. దాంతో పాటు కొన్నాళ్లు ఆగితే ఆమెపై సినీ వర్గాల వారితో పాటు, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు ఆమె కావాలని కోరుకున్నా కూడా అవకాశాలు రావు. ఆ విషయాన్ని ఆమె గుర్తించి ఇప్పటికి అయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వాలని ఆమె ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.