ఏ తోడు లేక జగన్ ఒంటరి నడక?

Ys Jagan going s single to 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో ఒక్క నిర్ణయం ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్ ని చూస్తే అర్ధం అవుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ లో ప్రతిపక్షం బలంగా వుంది. విపక్ష ఓటు చీలకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి అధికారం దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు. ఇక టీడీపీ యేతర రాజకీయ పార్టీలు అయితే జగన్ తో కలిసి నడవడానికి ఉవ్విళ్ళూరాయి. కానీ జగన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో వైసీపీ వైపు చూసే నాధుడే లేకుండా పోయాడు. జగన్ తో రాజకీయంగా కలిసి పని చేయడానికి కాంగ్రెస్ కూడా ఓ దశలో గట్టి ప్రయత్నాలే చేసింది. కానీ మోడీని చూసి భయపడ్డాడో, కేసులతో వణికిపోయాడో గానీ రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన వచ్చిన వెంటనే బీజేపీ సరెండర్ అయిపోయారు జగన్. పైగా nda అభ్యర్థి గెలిచే అవకాశం వున్నప్పుడు ఇంకో అభ్యర్థిని బరిలో నిలబడం కూడా మంచిది కాదన్న రేంజ్ లో జగన్ మాట్లాడారు.

దీంతో జగన్ తో అంటకాగడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆయన్ని ఏకిపారేస్తోంది. కోవిద్ కి మద్దతు ఇవ్వడమంటే మతతత్వ శక్తులకు ఊతం ఇచ్చినట్టే అని కాంగ్రెస్ అంటోంది. ఇక వామపక్షాలు కూడా జగన్, చంద్రబాబుని ఒకే గాటన కట్టేశాయి. ఆయనతో కలిసే ప్రసక్తే లేదని తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఇక రాజకీయంగా పవన్ నేతృత్వంలోని జనసేన, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా కలిసి ఓ కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికలకు సిద్ధం అవుతామని ఆయన ప్రకటించారు. ఎర్ర జెండాలు ఇలా రగిలిపోతుంటే ఎంత త్యాగం చేసినా కాషాయ జెండా (బీజేపీ ) కూడా జగన్ తో కలిసి నడవడానికి సిద్ధంగా లేదు. దీంతో జగన్ ఏ తోడు లేక ఒంటరి నడక నడవాల్సివస్తోంది.

మరిన్ని వార్తలు

కాంగ్రెస్, వైసీపీ మధ్య ఉండవల్లి.

జగన్ పైకి బాణం వదిలిన ఉండవల్లి.

మీడియాపై ట్రంప్ అతి వీడియో