పసుపుమయంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మారింది. మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో మైలవరం నియోజకవర్గం స్థాయిలో ఇవాళ మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ‘నేను పార్టీ వాడిని, మైలవరం నియోజకవర్గంలో ఎవరు గ్రూపులు కట్టొద్దు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.