మద్యం కుంభకోణం విచారణ వేగవంతంగా సాగుతోందని, నిందితులు ఎవరున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మనీ ల్యాండిరింగే కాదు.. నాసికం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్నీ జగన్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అనేకమంది అమాయక ప్రజలను జగన్ పొట్టన పెట్టుకున్నాడని విమర్శించారు.