నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ఈనెల రెండవ లేదా మూడవ వారంలో జరిపేందుకు క్రిష్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా సాయి కొర్రపాటితో కలిసి నిర్మిస్తున్నాడు. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 65 కోట్ల బడ్జెట్‌ను బాలకృష్ణ రికవరీ చేయగలరా అంటూ అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఉన్న కారణంగా భారీ మొత్తానికి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
బాలీవుడ్‌కు చెందిన రిలయన్స్ మరియు సోనీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని హోల్‌సేల్‌గా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపు 85 కోట్ల మేరకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు సదరు సంస్థలు సిద్దంగా ఉన్నాయని సమాచారం అందుతుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్, ప్రైమ్ వీడియో, ఆన్లైన్ రైట్స్ అన్ని కూడా ఇస్తున్నాం కనుక 100 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఈ డీల్ పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జీవింతలోని దాదాపు అన్ని ముఖ్య ఘటాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్ నటించింది కనుక బాలీవుడ్లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.