Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో మొదలయ్యే అవకాశం ఉందని అంతా ఎదురు చూస్తున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, అసలు సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దర్శకుడు తేజ వ్యవహార శైలిపై హీరో బాలకృష్ణ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టీజర్ విషయంలోనే తీవ్రంగా నిరాశ పర్చిన తేజ తాజాగా స్క్రిప్ట్ విషయంలో కూడా బాలయ్యను సంతృప్తి పర్చలేక పోయాడని, దాంతో బాలయ్య ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది.
తన తండ్రి జీవిత చరిత్ర చిత్రాన్ని బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాలని భావించాడు. అలాంటి నేపథ్యంలో సినిమాను ఆశామాషీగా చేయాలనుకుంటున్న తేజ నుండి ప్రాజెక్ట్‌ను వెనక్కు తీసుకోవాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ స్వయంగా స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామి కావాలని భావిస్తున్నాడు. అది తేజకు నచ్చడం లేదు. సొంతంగానే స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తాను అంటూ చెప్పడం కూడా బాలయ్యకు కోపంను తెప్పిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య, తేజల మద్య వచ్చిన విభేదాలు సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని, తాత్కాలికంగా లేదా శాస్వతంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం అటకెక్కే అవకాశాలున్నాయి. గతంలో బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాలనుకున్న నర్తనశాల చిత్రం కూడా అటకెక్కిన విషయం తెల్సిందే.