నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’. ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ చిత్రంలో క్రిష్ హ్యాండ్ వేయడం జరిగిందో, అప్పటి నుండి సినిమా స్థాయి అమాంతం పెరుగుతూ వచ్చింది. చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అంచనాు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎన్టీఆర్ మూవీపై సినీ వర్గాల వారితో పాటు అన్ని వర్గాల వారికి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు హాట్ కేక్ మాదిరిగా అందుకునేందుకు ఎగబడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం బిజినెస్ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున డబ్బు పెట్టి రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే భారీ మొత్తంకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. అన్ని రైట్స్ ద్వారా ఈ చిత్రం దాదాపు 85 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన ఏ చిత్రం కూడా ఈ స్థాయిలో వసూళ్లు చేసింది లేదు. కాని సినిమాపై అంచనాలున్న నేపథ్యంలో ఇంత భారీగా కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రంను 60 కోట్ల బడ్జెట్‌తో బాలకృష్ణ నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ మొదటి సారి 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందనిపిస్తుంది.