కేసీఆర్ పెట్టిన చీర మాయం !

Temple Employee Stole Goddess Saree in Kaleswara Temple

భూపాలపల్లి జిల్లాలోని ప్రఖ్యాత కాళేశ్వర దేవస్థానంలో చోరీ జరిగింది… సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర చోరికి గురైంది. ఆలయ ఉద్యోగే చీరను మాయం చేసినట్లు వార్తలు గుప్పుమనడంతో అప్రమత్తమైన ఉద్యోగి వరంగల్‌ వెళ్లి అలాంటి మరో చీర కొనుక్కొచ్చి అపహరించిన చీర స్థానంలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లిస్తానని 2012లో కేసీఆర్ మొక్కుకున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఆలయానికి చేరుకుని శుభానంద దేవికి బంగారు కిరీటాన్ని పట్టువస్త్రాలను బహుకరించారు. ఇప్పుడు ఆ చీరే మాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమ్మవారి చీర మాయం కాలేదని… భద్రంగా ఉందని ఆలయ, ఛైర్మన్, ఈవో చెబుతున్నారు.