సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’తో చాలా బిజీగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రం కోసం మహేష్‌బాబు విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎవరికి దొరకనంత బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో మహేష్ బాబుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఎన్టీఆర్ అభిమానుల విమర్శల్లో అర్థం ఉందని, వారు చేస్తున్న ఆరోపణల్లో ఒక ఆవేదన ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నట్లుగా వివాదం జరుగుతుంది. ఈ పెద్ద వివాదానికి కారణం చాలా చిన్నది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిన్న వివాదం ఏంటీ అంటే… ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంపై మహేష్ బాబు స్పందించక పోవడం. అవును అరవింత సమేత చిత్రాన్ని ప్రశంసిస్తూ మహేష్ స్పందించలేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్పుడే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు తగ్గి పోయాయి. మళ్లీఇప్పుడు ఆ విమర్శలు పెరిగాయి. ఎందుకంటే తాజాగా మహేష్ బాబు ‘సర్కార్’ చిత్రంపై ప్రశంసలు చేస్తూ ట్వీట్స్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తీవ్ర ఆగ్రహంతో రెచ్చి పోతున్నారు. సర్కార్ సినిమా బాగుందని చెప్పిన మహేష్ ఒక్క మాట అరవింద సమేత గురించి కూడా స్పందించి ఉంటే బాగుండేది కదా అంటూ ఫ్యాన్స్ కొందరు అంటున్నారు. సర్కార్ చిత్రం కంటే అరవింద సమేత చిత్రం బాగుందా లేదంటే తమిళ సినిమానే మహేష్‌కు ఎక్కువా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.