Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా అన్న కళ్యాణ్ రామ్‌తో చాలా ఆప్యాయంగా ఉంటున్నాడు. గతంలో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్‌ను దూరంగా పెడుతూ వచ్చారు. కాని కళ్యాణ్ రామ్ మాత్రం గత కొన్నాళ్లుగా తమ్ముడిపై అత్యంత ఆప్యాయతను చూపిస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ కూడా అన్న కెరీర్‌కు చాలా తోడ్పాటును అందిస్తున్నాడు. అన్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, అన్న నిర్మాణ సంస్థ లాస్లో ఉందని ఒక చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ కోసం చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన ‘జైలవకుశ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. దాంతో కళ్యాణ్ రామ్‌కు కాసుల పంట పండినట్లయ్యింది.
ఇక కళ్యాణ్ రామ్‌ను హీరోగా సెటిల్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అందుకే కోసం మంచి కథలను కళ్యాణ్ రామ్‌కు ఫార్వర్డ్ చేయడంతో పాటు, కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు చెబుతున్నాడట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు పూర్తి అయిన వెంటనే పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక విభిన్న నేపథ్యంలో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంలో గెస్ట్ రోల్లో ఎన్టీఆర్ మరియు హరికృష్ణలు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దర్శకుడు పవన్ సాదినేని చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ స్వయంగా కళ్యాణ్ రామ్‌కు ప్రిపర్ చేయడం జరిగింది. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా గెస్ట్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో నటిస్తే కళ్యాణ్ రామ్ సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం.