Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన చిత్రం ‘సరైనోడు’. బన్నీ కెరీర్లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఆ సినిమా హిందీలో డబ్ అయ్యి ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారం అయ్యింది. భారీ టీఆర్పీరేటింగ్ రావడంతో పాటు, అదే సినిమాను సదరు ఛానెల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్లో యూట్యూబ్ వ్యూస్ వచ్చాయి. ఆ కారణంగా తెలుగు సినిమాలను హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ హాట్ కేకుల మాదిరిగా కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నాయి.
తాజాగా ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై లవకుశ’ చిత్రాన్ని హిందీ జీ సంస్థ ఏకంగా 11 కోట్లు పెట్టి డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. జీ టీవీ ఒక సౌత్ సినిమాను ఈస్థాయి రేటు పెట్టి కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. తెలుగులో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంత మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. రెండు మూడు సంవత్సరాల ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కేవలం రెండున్నర నుండి మూడున్నర కోట్లు మాత్రమే ఉండేది. కాని సరైనోడు ఎప్పుడైతే భారీ విజయాన్ని సొంతం చేసుకుందో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అంతకు ముందు బాహుబలి సినిమా తెలుగు సినిమాల స్థాయి ఏంటో బాలీవుడ్ వారికి చూపించింది. ఈ కారణాల వల్ల ఎన్టీఆర్ సినిమాకు 11 కోట్ల భారీ మొత్తం దక్కింది. కేవలం 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జై లవకుశ’ చిత్రం ఇప్పటి వరకు 115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
మరిన్ని వార్తలు: