ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పంచాయితీ అందుకా?

http://telugubullet.com/wp-content/uploads/2017/06/ntr-kalyan-ram-meeting-abou.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల పంచాయితీ ముగిసింది.రామలక్ష్మణుల్లా,లవకుశల్లా వుండే వాళ్ళ మధ్య పంచాయితీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? జైలవకుశ విషయంలోనే ఈ పంచాయితీ జరిగిందట. అయితే ఇద్దరు అన్నదమ్ములు గొడవపడ్డారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ ఇద్దరు కలిసి కూర్చుని జైలవకుశ కి సంబంధించి ఓ పంచాయితీ ని ఏ గొడవల్లేకుండా తేల్చేశారు. ఇంతకీ ఆ మేటర్ ఏంటనేగా మీ డౌట్.అక్కడికే వస్తున్నాం.

జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు రోల్స్ పోషిస్తున్నాడు అనగానే ఓ ప్రచారం జరిగిపోయింది. తమిళ్ లో ఒకప్పుడు అజిత్ చేసిన వరలారు సినిమాకి ఇది ఫ్రీ మేక్ అని సోషల్ మీడియా కోడై కూసింది. కాలం గడిచే కొద్దీ,ఎన్టీఆర్ పోస్టర్స్ బయటికి వచ్చే కొద్దీ సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఇది చూసిన వరలారు నిర్మాతలు నిజంగానే తమ సినిమాని కాపీ కొట్టి జైలవకుశ తీస్తున్నారేమోనని సందేహ పడ్డారు. ఇంకేముంది… కొందరు మధ్యవర్తుల ద్వారా మేటర్ ని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దృష్టికి తీసుకెళ్లారు. జైలవకుశ వేరే స్టోరీ అయినా వరలారు నిర్మాతల డౌట్ తీర్చేందుకు ఈ అన్నదమ్ములు ఓ సమావేశం ఏర్పాటు చేశారట. అన్నదమ్ములు దగ్గర కూర్చుని జైలవకుశ దర్శకుడితో వరలారు నిర్మాతలకు కధ వినిపించారట. దీంతో తమ సినిమాతో ఈ కధకి సంబంధం లేదని తేలడంతో పాటు కధ అదిరిపోయిందని చెప్పి మరీ వాళ్ళు చెన్నై వెళ్లారట. ఆ విధంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పంచాయితీ ముగించేశారు.