యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రాలు అనగానే ఆయన డాన్స్‌ను అభిమానులు ఆస్వాదించేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే ఠక్కువ వచ్చే పేర్లలో ముందు వరుసలో ఎన్టీఆర్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాలు పెట్టుకుని ఎన్టీఆర్ సినిమాను చూసేందుకు అభిమానులు మరియు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ డాన్స్ సినిమాలో లేదు అంటూ ఖచ్చితంగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద సమేత చిత్రం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చబోతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటీ అంటే అరవింద సమేత చిత్రంలో మొత్తం అయిదు పాటలను దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయిదు పాటల్లో ఒక పాట బ్యాక్ గ్రౌండ్‌సాంగ్. ఇక మిగిలిన నాలుగు పాటల్లో రెండు పాటలు మెలోడీ పాటలు. రెండు పాటలు మాత్రమే కాస్త మాస్ బీట్ సాంగ్. కాని రెండు పాటల్లో ఒక పాటను తొలగించినట్లుగా తెలుస్తోంది. మాస్ బీట్ సాంగ్‌ను విదేశాల్లో చిత్రీకరించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. కాని ఆ పాట విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ తలకిందులు అయ్యింది. సమయం లేని కారణంగా మొత్తానికి ఆ పాటను తొలగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దాంతో కేవలం ఒక్క మాస్ బీట్ సాంగ్ మాత్రమే ఈ చిత్రంలో ఉండబోతుందని తెలుస్తోంది. ఆ ఒక్క సాంగ్‌లోని డాన్స్‌తో ఫ్యాన్స్ తృప్తి పడాల్సిందే అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దసరా కానుకగా ఈ చిత్రంను వచ్చే నెల 11న విడుదలకు సిద్దం చేస్తున్నారు.