Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇంకో నెలలో షూటింగ్ మొదలు కూడా కాబోతోంది. ఆ సినిమా కోసమే భారీగా కసరత్తులు చేసి ఎన్టీఆర్ మరీ సన్నబడిపోయారంట. త్రివిక్రమ్ స్టైల్ కి తగ్గట్టు వుండాలని ఈ విషయంలో ఎన్టీఆర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ టాపిక్ మీద కన్నా అందరి దృష్టి ఇప్పుడు అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ మీద వుంది. త్రివిక్రమ్ సత్తా మీద సందేహాలు, విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి టైం లో త్రివిక్రమ్ తో సినిమా అంటే ఇంకో హీరో ఎలా ఫీల్ అయ్యేవాడో గానీ ఎన్టీఆర్ మాత్రం హ్యాపీ అట. ఇలా అంటే వేరే అర్ధాలు తీసుకోవద్దు. వ్యంగ్యం అనుకోవద్దు. నిజంగానే త్రివిక్రమ్ తో సినిమా గురించి ఎన్టీఆర్ పిచ్చ హ్యాపీగా ఉండేందుకు కారణం వుంది.
టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ కూడా తెలిసోతెలియకో హిట్ డైరెక్టర్ల వెంటబడ్డాడు. కానీ ముందు సినిమా హిట్ తో అతివిశ్వాసంతో ఆ దర్శకులు పని చేయడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. పూరి పెద్ద సక్సెస్ ల్లో లేకపోయినా ఎన్టీఆర్ అవకాశం ఇస్తే టెంపర్ లాంటి మంచి సినిమా వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ గాడిలో పడింది. ఇక ఈమధ్య కూడా సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ప్లాప్ తీసిన బాబీకి ఛాన్స్ ఇస్తే జైలవకుశ లాంటి హిట్ సినిమా ఎన్టీఆర్ కి మిగిలింది. దీంతో సక్సెస్ వెంట పరిగెత్తడం కన్నా ప్లాప్స్ తో కసిగా వున్న దర్శకులు అయితేనే బెటర్ అని ఎన్టీఆర్ అనుకుంటున్నారట. అయితే అనుకోకుండా అజ్ఞాతవాసి ప్లాప్ కావడంతో త్రివిక్రమ్ కూడా తన మీద విమర్శలకి పనితోనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నారట. మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోడానికి ఎన్టీఆర్ సినిమాని ఓ ఛాలెంజ్ గా తీసుకుంటున్నారట. ఏ దర్శకుడు అయినా తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఏ స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతాడో అందరికీ తెలుసు. ఇక త్రివిక్రమ్ లాంటి మేధావి ఇంకా ఏ రేంజ్ లో ఈ సినిమా కోసం కష్టపడతాడో వేరే చెప్పాలా ! అందుకే ఈ పరిస్థితులు అన్ని తెలిసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా విషయంలో ఏ సంకోచం లేకుండా పిచ్చ హ్యాపీ గా ఉన్నారట.