టాలీవుడ్‌లో అనిరుధ్‌కు కష్టమే

NTR removes anirudh ravichander as music Director for his movie

చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న అనిరుథ్‌ తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడ్డాడు. దాదాపు రెండు సంవత్సరాలు మంచి ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూసిన అనిరుథ్‌కు పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి రూపంలో అదిరిపోయే అవకాశం దక్కింది. కాని ఆ అవకాశాన్ని అనిరుథ్‌ చేజార్చుకున్నాడు. సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో పాటు, పాటలు మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగాలేదు అనే టాక్‌ రావడంతో అనిరుథ్‌కు టాలీవుడ్‌లో కెరీర్‌ కొనసాగించడం కష్టమే అని తేలిపోయింది. తమిళంలో స్టార్‌ హీరోలకు సంగీత దర్శకుడిగా చేస్తున్న అనిరుథ్‌కు తెలుగులో మాత్రం ఎంట్రీ చాలా కష్టం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌తో చేసిన ఈ చిత్రం సక్సెస్‌ అయ్యి ఉంటే ఆయన కెరీర్‌ మరోరకంగా ఉండేది. 

త్రివిక్రమ్‌ తన తర్వాత సినిమాను ఎన్టీఆర్‌తో చేయబోతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. మొదటి నుండే ఆ సినిమాకు సంగీతాన్ని అనిరుథ్‌ చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాత చెప్పుకొచ్చాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ విజ్ఞప్తి మేరకు ఆ ప్రాజెక్ట్‌ నుండి అనిరుథ్‌ను తొలగించడం జరిగింది. అనిరుథ్‌ సంగీతం తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. అవకాశం కలిసి వచ్చి, అనిరుథ్‌కు స్టార్‌ హీరోకు సంగీతం చేసే ఛాన్స్‌ వస్తే, ఆ పాటలు సక్సెస్‌ అయితే అప్పుడు టాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ లభిస్తుంది. కాని అతడికి ఆ ఛాన్స్‌ ఇచ్చేది ఎవరు, ఒక వేళ వచ్చినా అది సక్సెస్‌ అయ్యేనా అనేది చూడాలి. అనిరుథ్‌ సంగీతం తెలుగులో మరో రెండు సార్లు ఫ్లాప్‌ అయితే ఇక ఆయన తమిళంకే పరిమితం అవ్వాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.