ఎన్టీఆర్ రెండో కొడుక్కి అప్పుడే ఏడాది

ntr second son became one year old

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో తారక్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందించాడు. భార్గవ్ కు అప్పుడే ఏడాది వయసు వచ్చేసిందని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా భార్గవ్ తో దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభిమానులు భార్గవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి మాత్రం కావల్సినంత సమయాన్ని ఎన్టీఆర్‌ కేటాయిస్తాడు. పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి స్పెషల్‌ డే అయితే ఫ్యామిలీతోనే గడుపుతాడు.  ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్‌రామ్‌కు ఏడాది నిండాయని తెలిపాడు. నేడు భార్గవ్‌రామ్‌ మొదటి పుట్టినరోజును ఎన్టీఆర్‌ గట్టిగానే సెలబ్రేట్‌ చేస్తున్నాదట. ఇక  చేతికి గాయం కావడం వల్ల కొన్నిరోజులు విరామం తీసుకున్న ఎన్టీఆర్‌.. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.