ఢిల్లీ వెళ్లనున్న జగన్…ఆయనతో భేటీ ఎందుకో ?

jagan going to delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనసభలో శుక్రవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం తాడేపల్లిలో జరిగే బడిబాట కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే జగన్ వెంట పలువురు పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు కూడా వెళ్లనున్నారు. సీఎం జగన్…హస్తినలో ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఆయనతో పలు అంశాలపై చర్చించినున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పనుల నిమిత్తం రెండు,మూడు రోజులు జగన్ ఢిల్లీలో ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో పాటు శనివారం ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా జగన్ పాల్గొంటారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్‌తో ముడిపడి ఉందనే సంగతి తెలిసిందే. గతంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పినందుకే తాము ఇవ్వలేకపోతున్నామని కేంద్రం తెలిపింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను నీతి ఆయోగ్‌కు వివరించడానికి సీఎం జగన్ ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేయించారు.ఈ సమావేశంలో సీఎం..ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే చర్యలు చేపట్టాలని కోరనున్నారు.  .