ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి – బాలకృష్ణ

NTR should be given Bharat Ratna – Balakrishna
NTR should be given Bharat Ratna – Balakrishna

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమకి అందించిన సేవలకి గాను నందమూరి బాలకృష్ణను పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో బాలయ్య, సీనియర్ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఇంతకీ బాలయ్య ఏం మాట్లాడారు అంటే.. ‘నాకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను’ అని బాలయ్య తెలియచేసారు .

NTR should be given Bharat Ratna – Balakrishna
NTR should be given Bharat Ratna – Balakrishna

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాను. ఇది తెలుగు ప్రజలందరి కోరిక. ఉమ్మడి ఏపీ మాజీ సీఎంగా, దివంగత నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో సేవలు చేశారు. అలాంటి మహనీయుడికి ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్నట్టు బాలకృష్ణల తో పాటు తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌, మాజీ క్రేజీ హీరోయిన్ శోభన తదితరులని కూడా పద్మ భూషణ్‌ అవార్డులకి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.