Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. సంక్రాంతి సందర్బంగా చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. పవన్ మూవీ విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే ఎన్టీఆర్‌తో మూవీని త్రివిక్రమ్ పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడు అంటూ గత కొన్ని వారాలుగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేయబోతున్న సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడట. గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్’ చిత్రంలో ఎన్టీఆర్ బాడీ చూపించాడు. అయితే సిక్స్ ప్యాక్ అంతగా కనిపించలేదు. ఆ సమయంలో సిక్స్ ప్యాక్ కోసం ఎక్కువ కష్టపడని ఎన్టీఆర్ ఈ సారి మాత్రం అప్పటి కంటే ఎక్కువ కష్టపడుతూ సిక్స్ ప్యాక్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తే నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఫిదా అవ్వాల్సిందే. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో అంటేనే సంచలనం, ఆ సంచలనంకు తోడు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా అను ఎమాన్యూల్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.