బుల్లి తెరపై మెప్పిస్తాడా అన్న ప్రశ్నకు ఇదే సమాధానం

NTR Will Super Hit In MAA TV Big Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

NTR Will Super Hit In MAA TV Big Boss Show

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌ బాస్‌ షోను సౌత్‌లో తెలుగు, తమిళం మరియు కన్నడంలో తీసుకు వచ్చేందుకు స్టార్‌ ఛానెల్‌ ప్రయత్నాలు చేసింది. అది ఇన్నాళ్లకు సాధ్యం అయ్యింది. ఇటీవలే తమిళంలో ప్రారంభం అయిన ఈ షో తెలుగులో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. తెలుగు బిగ్‌ బాస్‌ షోను ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయబోతున్నాడనే వార్త రాగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌ ఆస్థాయిలో ఆకట్టుకుంటాడా అనే అనుమానం కొందరిలో ఉంది. బుల్లి తెరపై కాస్త ఎంటర్‌టైన్‌ చేస్తూ, సీరియస్‌ నెస్‌తో మెప్పించాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్‌ వెండి తెరపై అలరించినట్లుగా బుల్లి తెరపై అలరిస్తాడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. వారందరి అనుమానాలు పటాపంచలు చేసే ఒక టీజర్‌ను విడుదల చేయడం జరిగింది.

ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ లుక్‌ను, ఒక చిన్న టీజర్‌ను మాత్రమే విడుదల చేసిన స్టార్‌ మా వారు తాజాగా ఒక మంచి ప్రోమోను విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ రహస్యంగా బిగ్‌ బాస్‌ హౌస్‌లో సెలబ్రెటీలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాడు. కాస్త సరదాగా ఆ టీజర్‌ను చిత్రీకరించారు. ఎన్టీఆర్‌ ఆ టీజర్‌లో ఎలా యాక్ట్‌ చేశాడో చూడవచ్చు. బుల్లి తెరపై ఈ మాత్రం ఎంటర్‌టైన్‌ చేస్తే దుమ్ము దుమ్ముగా టీఆర్‌పీ రావడం ఖాయం. ఈ ప్రోమో చూసిన తర్వాత ప్రేక్షకుల కూడా ఎన్టీఆర్‌ ఖచ్చితంగా ఆకట్టుకుంటాడనే నమ్మకం పెంచుకున్నారు. ఈ షోతో ఎన్టీఆర్‌ రేంజ్‌ మరింత పెరుగుతుందనే నమ్మకంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో…

రావణుడొచ్చాడు.