తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(వరంగల్), తేరా చిన్నప్పరెడ్డి(నల్లగొండ) గెలుపొందారు, అలాగే ఎమ్మెల్యేల కోటా కింద నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, వీరితో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఆనంద్, మహేశ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరయ్యారు.