సీరియల్ సస్పెన్స్ – రవిప్రకాష్ న్యూసెన్స్

raviprakash nuisance

ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కొత్త యాజమాన్యానికి ఇబ్బంది పెట్టేందుకే కొత్త ఎత్తుగడలు వేసినట్లు ఆరోపించారు ప్రభుత్వ న్యాయవాది. సంస్థ లోగోను రూ.99 వేలకు విక్రయించారన్నారు. ఒక సంస్థ ఉద్యోగికి ఆ సంస్థ లోగోను విక్రయించే హక్కులు ఉండవని తెలిపారు. సంస్థను విక్రయించకుండా ఉండేందుకు రవిప్రకాశ్‌ అనైతికంగా వ్యవహరించారనీ, ఫోర్జరీ చేయడంతో పాటు సినీ నటుడు శివాజీని తెరపైకి తెచ్చారనీ అన్నారు. ఎప్పుడో గత సంవత్సరం టీవీ9 యాజమాన్య బదిలి దగ్గరినుండి కొనసాగుతున్న ఈ కేసు ఇప్పుడు తెలుగు ప్రజలకి ఓ సస్పెన్స్ లా మారింది. రవిప్రకాష్ న్యూసెన్స్ చేశారా లేదా అనేది ఎప్పుడు తేలుతుందో….. అలాగే బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా తయారయింది.