మోదికి నై

no for modi

సోంత మెజార్టీతో పార్లమెంట్లో రెండోసారి అదికారాన్ని సుస్థిరం చేసుకున్న భారత ప్రదాని మోది పిలిపు కోసం దేశాదినేతలు సైతం ఎదురుచూస్తుంటారు కదా… మరలాంటిది మోది పిలిస్తే వెళ్లనూ అన్నది ఎవరూ అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నా ఎన్నికైన వెంటనే ప్రమాణస్వీకారం, మంత్రివర్గ ఏర్పాటు, వారికి శాఖల కేటాయింపు, విదేశీ పర్యటనలు, వంటి నిర్ణయాలతో దూసుకుపోతున్న మోది అదే ఊపుతో ఎన్డీఏ 2 సర్కారు తొలి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు, నాలుగైదు అంశాలు ఉన్నా ప్రదాన అజెండా జమిలీ ఎన్నికలే. దేశవ్యాప్తంగా ఓకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల వ్యయాన్ని అలాగే కోడ్ ద్వారా కుంటుపడే అభివ్రుద్దిని ద్రుష్టిలో పెట్టుకొని ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనతో తొలి అఖిల పక్షాన్ని ఈ బుదవారం పంతొమ్మిదో తారీఖున నిర్వహిస్తున్నారు, ఇందుకోసం అన్ని పార్టీల అధ్యక్షులని ఆహ్వానించారు. అయితే ఈ బేటికి వెళ్లేది లేదని బెంగాల్ దీదీ మమతా, తెలుగు పెద్దన్న చంద్రభాబు, తమిళ తంబి స్టాలిన్ తో పాటు తెలంగాణా సీఎం కేసీఆర్ సైతం తెగేసి చెప్పారు. కొసమెరుపేమిటంటే.. చంద్రన్నలిద్దరూ తమ దూతల్ని మాత్రం పంపుతున్నారు.