ఓలాలో “సెల్ఫ్‌ డ్రైవ్‌”

ఓలాలో

సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలను ప్రవేశ పెట్టిన ఓలా సంస్థ “ఓలా డ్రైవ్‌” పేరుతో బెంగళూరులో ఈ  సేవలను ప్రారంభించింది. భవిష్యత్తులో కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో  2020 లో 20 వేల సెల్ప్‌ డ్రైవ్‌ కార్లను సమకూర్చే ప్రయత్నం ఓలా సంస్థ ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్‌, ముంబయి, డిల్లీ నగరాల్లో త్వరలోనే ఓలా డ్రైవ్‌ సేవలు ప్రారంబించే సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఓలా సంస్థ ప్రకటనలో తెలిపింది.

ఈ సేవలకి తొలివిడతగా 1,400కోట్లు దాదాపు 200మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయబోనున్నట్టు ఓలా సేల్స్‌, మార్కెటింగ్‌ అధికారి అరుణ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.భద్రతా ఫీచర్లు హెల్ప్‌లైన్,రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ కల్పించబోనున్నట్టు కంపెనీ తెలిపింది.

సెక్యూరిటీ డిపాజిట్‌ 2,000 రూపాయలు రెండు గంటల పాటు కారును పొందడం కోసం చెల్లించాల్సి వస్తుందని, బెంగళూరులో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులో ఓలా ఉంచింది.