సందేహం లో ఉన్న ‘ఇస్మార్ట్ శంక‌ర్’

సందేహం లో ఉన్న 'ఇస్మార్ట్ శంక‌ర్'

ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో అనుకోకుండా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. ఈ సినిమా ఈ స్థాయిలో ఆడుతుంద‌ని రామ్ ఊహించి ఉండ‌డేమో. ఈ సినిమా ఇలాంటి ఫ‌లితాన్నందుకున్నాక త‌ర్వాత ఎలాంటి చిత్రం చేయాల‌నే విష‌యంలో రామ్ డైల‌మాలో ప‌డిపోయాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చేస్తుండ‌గా.. త‌మిళ హిట్ త‌డం రీమేక్‌లో న‌టించ‌డానికి సూచ‌న ప్రాయంగా అంగీక‌రించాడు రామ్.

ఐతే మాస్ మ‌సాలా సినిమాల‌తో పెద్ద హిట్టు కొట్టిన‌పుడ‌ల్లా రామ్ డైల‌మాలో ప‌డ‌టం మామూలే. మ‌ళ్లీ అలాంటి సినిమాల వైపే ఆస‌క్తి చూపిస్తుంటాడు. కొత్త త‌ర‌హా సినిమాల‌పై అనాస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుంటాడు. ఈ నేప‌థ్యంలో త‌డం రీమేక్‌ను ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ ఓ మాస్ సినిమా చేద్దామా అని అత‌ను పున‌రాలోచిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి.

ఐతే తడం రీమేక్ విష‌యంలో త‌ట‌ప‌టాయించిన రామ్.. చివ‌రికి దానికే ఫిక్స‌యిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌తో నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ సినిమాలు తీసిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలోనే రామ్ త‌డ‌మ్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ చిత్రానికి క‌థానాయిక‌లు కూడా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా ఫేమ్ నివేథా పెతురాజ్‌తో పాటు నేల టికెట్ భామ మాళ‌విక శ‌ర్మ రామ్‌తో జోడీ క‌ట్ట‌బోతున్నార‌ట‌.

త‌డ‌మ్ సినిమా రిలీజైన కొన్ని రోజుల‌కే హ‌క్కులు సొంతం చేసుకున్న రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. వ‌చ్చే ఏడాది వేస‌వి రిలీజ్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళంలో మ‌గిల్ తిరుమ‌ని రూపొందించిన త‌డం సినిమాలో అరుణ్ విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. రామ్ కెరీర్లో ఇదే తొలి డ‌బుల్ రోల్ కానుంది.