రేపు బంద్‌

రేపు బంద్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకి ప్రభుత్వంనుంచి ఎటువంటి పిలుపు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు,నిరసనలు వస్తున్నాయి.ప్రజా,ఉద్యోగ సంఘాలు, విపక్ష పార్టీలు, న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ కూడా కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నారు.

వియస్‌టీ వద్ద సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లి బస్భవన్ వరకూ ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్థామ రెడ్డి, ఇతర నేతలను కూడా అరెస్టు చేసి తీసుకెళ్లారు.కరీంనగర్లో రెండుడిపో కార్మికులు ధర్నా,బైక్ ర్యాలీ చేశారు. శేరిలింగంపల్లి నుంచి కూకట్‌పల్లి వరకు  సమ్మెకి మద్దతుగా బీజేపీ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్  బైక్‌ ర్యాలీ చేశారు.

నేడు ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక నిర్ణయం తిసుకుకోబోనున్నది. ప్రభుత్వానికి ఆర్టీసీకి ఎండీని నియమించి, ఇరు పక్షాలు చర్చించుకుని సమస్యల గురించి పరిష్కరించు కోవాలని సూచించింది. నివారం రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చే తీర్పు కొరకి ఇరు పక్షాలు వేచిచూస్తున్నారు.

శనివారం రాష్ట్రబంద్‌కు సహకరించాలని సీపీఎంనేత తమ్మినేని వీరభద్రం ప్రజలకి తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని ఇంకా వ్యాపార, వాణిజ్య వర్గాలు సహకరించాలని కోరుతూ  వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చారని చెప్పారు.