నిరసనల సెగ: ఒలంపిక్స్ ను తాకిన జార్జ్ ఫ్లాయిడ్ సెగ…

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ తీవ్రస్థాయిలో  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నిరసనలు తెలపడానికి పలువురు క్రీడాకారులు తరలివచ్చిన సమయంలో ఒలంపిక్స్ క్రీడలలో నిరసన వ్యక్తం చేయడాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) నిరాకరించింది. ఒలింపిక్ చార్టర్ రూల్ 50 ప్రకారం “ఏ ఒలింపిక్ సైట్లు, వేదికలు లేదా ఇతర ప్రాంతాలలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేయకూడదని తెలిపింది. ఎలాంటి రాజకీయ, మత జాతి ప్రచారం అనుమతించమని స్పష్టం చేసింది.

అలాగే… అలాంటి నిబంధనను ఉల్లంఘించిన అథ్లెట్లు తీసుకోబోయే క్రమశిక్షణ చర్యలకు కట్టుబడి ఉండాలని ఐఓసి జనవరిలో మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా మే 25వ తేదీన తెల్ల మిన్నియాపాలిస్ పోలీసు అధికారి తన మోకాలిని ఫ్లాయిడ్ మెడలో దాదాపు తొమ్మిది నిమిషాల పాటు నొక్కడంతో 46 ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తి ఫ్లాయిడ్ మరణించాడు. కాగా ఒలింపిక్స్‌లో అథ్లెట్ల నిరసనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయి. 1968 మెక్సికో లో జరిగిన గేమ్స్‌లో బ్లాక్ యు.ఎస్. స్ప్రింటర్లు టామీ స్మిత్, జాన్ కార్లోస్ తలలు వంచి, జాతి అసమానతను నిరసిస్తూ పోడియంపై నల్లని చేతితో పిడికిలిని పైకి లేపారు. అలాగే రియో 2016 లో, ఇథియోపియన్ మారథాన్ రన్నర్ ఫెయిసా లిలేసా వ్యవసాయ భూములను తిరిగి కేటాయించాలన్న ప్రభుత్వ ప్రణాళికలపై తన ఒరోమో తెగ నిరసనలకు మద్దతగా విజయం సాధించిన తర్వాత తన చేతులను పైకి లేపిన ఘటనలు ఉన్నాయి.