కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గకముందే కొత్త వేరియంట్ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది.దేశంలో ఇప్పటి వరకు 200 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది.
వీరిలో 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా…వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్ 18, కేరళ 15, గుజరాత్ 14, ఉత్తరప్రదేశ్ 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.