రాంచీ వీధుల్లో “నిసాన్‌ జోంగా”

రాంచీ వీధుల్లో నిసాన్‌ జోంగా

కార్లు, బైక్‌లు రైడింగ్ అంటే ధోనికి చాలా ఇష్టం. ఏకంగా క్రికెట్ స్టేడియం లోనే బైక్, కార్లు నడిపి సరదా తీర్చుకున్న సన్నివేశాలు ఎన్నో. తను కొన్నవి, బహుమతిగా వచ్చిన బైక్, కార్లు వేసుకొని రాంచీ రోడ్లపైకి వచ్చేసి తనకి ఇష్టమైన సరదా తీర్చుకుంటాడు.వాహనాల కలెక్షన్ ఇష్టం కాబట్టి మార్కెట్లోకి వచ్చిన వెరైటీ బైక్‌, కార్లను ధోనీ కొనుగోలు చేస్తూ ఉంటాడు. కొత్తగా కొన్న జీపు కాస్త విభిన్నంగా ఉండి, సైనికులు ఉపయోగించే “నిసాన్‌ జోంగా” మోడల్‌ జీపుగా ఉంది.

రాంచీ వీధుల్లో కొత్తగా కొన్న నిసాన్‌ జోంగా జీపును నడుపుతూ తన ఇంటికి దగ్గరలోని ఓ పెట్రోల్‌ బంకు ధోనీ వెళ్ళగా చూసిన అభిమానులు తన వద్దకి వచ్చి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు దిగి వెళ్ళిపోయాడు.

ధోనీ కార్లు, బైక్‌లకోసం అతిపెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. ఈగ్యారేజ్‌లో జీఎంసీ సియారా, కవాసకీ నింజా హెచ్-2, ఫెరారీ 599జీటీవో, హమ్మర్హెచ్-2, కాన్ఫెడరేట్ హెల్క్యాట్,బీఎస్ఏలాంటి అరుదైన బ్రాండ్లు డజన్లు కొద్ది ఉన్నాయి.