చోటు దక్కించుకోలేని క్రిస్‌గేల్‌

చోటు దక్కించుకోలేని క్రిస్‌గేల్‌

ఇంగ్లాండ్‌ ఆవిష్కరించిన 100 బంతుల క్రికెట్లో క్రిస్‌గేల్‌ కి స్థానం దక్కలేదు. టీ20 క్రికెట్లో రారాజు అయిన ఈ కరీబియన్‌ ఆటగాడికి టీ20 క్రికెట్లో సాదించిన ఘనతలు ఎన్నో. క్రిస్‌గేల్‌ ని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ యజమాని కూడా ముందుకు రాలేదు. శ్రీలంక ఆటగాడు దిగ్గజ పేసర్‌ లసిత్‌ మలింగ కూడా 100 బంతుల క్రికెట్లో స్థానం పొందలేదు. బాబర్‌ ఆజామ్‌ టీ2 ల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌ మన్‌, ఈ ఆటగాడి పరిస్థితి ఇంతే. ఏ జట్టూ కుడా వీళ్ళని కొనుగోలు చేయలేదు.

మిచెల్‌ స్టార్క్‌, స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కాగిసో రబాడతో పాటు క్రిస్‌గేల్‌, మలింగ 125,000 పౌండ్ల ధర విభాగంలో ఉన్నారు. వీళ్ళతో పాటు మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ కూడా ఉన్నారు. సదరన్‌ బ్రేవ్‌ జట్టు మిచెల్‌ స్టార్క్‌, స్టీవ్‌స్మిత్ ఇంకా డేవిడ్‌ వార్నర్ ని కొనుగోలు చేశాయి. ట్రెంట్‌ రాకెట్స్‌ రషీద్‌ఖాన్‌ను తీసుకుంది.100బంతుల క్రికెట్‌ లీగ్‌ తొలి సీజన్‌ వచ్చే ఏడాది జులైలో జరగనుండగా మొత్తం 96 మంది ఎంపిక అయ్యారు.