పవన్‌కళ్యాణ్‌ ని ముగ్గులోకి లాగుతోన్న దిల్‌ రాజు

పవన్‌కళ్యాణ్‌ని ముగ్గులోకి లాగుతోన్న దిల్‌ రాజు

పవన్‌కళ్యాణ్‌ని తిరిగి కెమెరా ముందుకి తీసుకు రావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రోజుకో ప్రాజెక్ట్‌ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ పవన్‌ కళ్యాణ్‌ అయితే ‘పింక్‌’ రీమేక్‌ తప్ప మిగతా దేనిపైన అంతగా ఆసక్తి చూపించడం లేదట. అందుకు కారణం ఏమిటంటే… పింక్‌ రీమేక్‌కి పవన్‌ని వారు కోరుతున్నది పాతిక రోజుల కాల్షీట్లు మాత్రమే. అది కూడా తనకి నచ్చినప్పుడు చేసినా ఓకే అంటున్నారు.

ఈ వెసులుబాటు వేరే కథలకి వుండదు. వాటి కోసం తాను కనీసం అరవై, డెబ్బై రోజులయినా కేటాయించాలి. ప్రస్తుతం వున్న బిజీలో పవన్‌కి కుదిరే పని కాదది. అందుకే పింక్‌ రీమేక్‌ అయితే బెస్ట్‌ ఆప్షన్‌ అని భావిస్తున్నాడు. ఆ రీమేక్‌ హక్కులు దిల్‌ రాజు వద్ద వున్నాయి.

త్రివిక్రమ్‌ ద్వారా పవన్‌కళ్యాణ్‌ని ముగ్గులోకి లాగుతోన్న దిల్‌ రాజు మంత్రం ఫలించేలానే వుందని ఇండస్ట్రీ టాక్‌. పవన్‌ కళ్యాణ్‌ మరో రెండు నెలల్లోగా కాస్త ఫిట్‌ అయి, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని, ఈలోగా తనకి వున్న వెన్ను నొప్పి సమస్యకి కూడా పరిష్కారం చూసుకుంటాడని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో పవన్‌ రీఎంట్రీ దాదాపు ఖాయమైనట్టే అనుకోవచ్చు.