ఆప్ఘనిస్థాన్ వెస్టిండిస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్లో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా తొల వన్డే మొదలైంది. ఈ వన్డే మ్యాచ్ ని చూడడానికి వచ్చిన ఓ ఆప్ఘనిస్థాన్ క్రికెట్ అభిమాని షేర్ఖాన్కి ఎత్తు కారణంగా చేదు అనుభవం ఎదురైంది.
రషీద్ ఖాన్ నాయకత్వంలో ఆప్ఘనిస్థాన్ జట్టు మరియు కీరన్ పొలార్డ్ కెప్టెన్గా వెస్టిండిస్ జట్టు మద్య మూడు వన్డేల సిరిస్ జరుగనున్నాయి. వన్డే సిరిస్ తర్వాత ఇదే స్టేడియం లో రెండు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ కూడా జరుగనుంది.
ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన షేర్ ఖాన్ 8 ఫీట్ల 2 ఇంచుల పొడవు ఉన్నాడు. కాబట్టి లక్నోలో బస చేయడానికి హోటల్ గదులు దొరకడం లేదు. కాబుల్ నుంచి లక్నోకు చేరుకున్న షేర్ ఖాన్ ఎత్తుకు సరిపడ హోటల్ గదులు లక్నోలో లేవు కాబట్టి షేర్ ఖాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. షేర్ఖాన్ నాకా పోలీసు స్టేషన్కు వెళ్ళి తన సమస్యను చెప్పుకోగా పోలీసులు అనంతరం షేర్ ఖాన్కు సంబంధించిన అన్ని ధ్రువ పత్రాలను పరిశీలించారు. ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన షేర్ఖాన్ బస చేయడానికి పోలీసులు ఒక ప్రదేశాన్ని చూపించారు. కాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.