నేటి నుంచి ప్రారంభమవనున్న ఆర్మీ న‌ర్సింగ్ కోర్సు దరఖాస్తులు

బీఎస్సీనర్సింగ్ కోర్సు

బీఎస్సీనర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ 2020 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన మ‌హిళా అభ్యర్థుల నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీకరిస్తుంది. 25సంవత్సరాలోపు వయసున్నవారు ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: 09.11.2019

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2019

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.12.2019

అడ్మిట్ కార్డు: డిసెంబరులో

పరీక్ష తేది: 2020 జనవరి రెండో వారంలో

ఫలితాల వెల్లడి: 2020 మార్చి చివరి వారంలో

ఇంటర్వ్యూ తేది: 2020 మే మొదటి వారంలో

కోర్సు: బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు

మొత్తం సీట్ల సంఖ్య: 220

అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌య‌సు:  01.10.1995 – 30.09.2003 మ‌ధ్య జ‌న్మించి ఉండి 17-25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.750.