Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన తాజా చిత్రం టీజర్ ను హీరో శ్రీకాంత్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమా పేరు ఆపరేషన్ 2019. బి వేర్ ఆఫ్ పబ్లిక్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. టీజర్ లో ఒక్క డైలాగ్ లేకపోయినప్పటికీ ఆకట్టుకుంటోంది. ఒంటినిండా గాయాలతో శ్రీకాంత్ నేలపై కూర్చుని ఉన్నాడు. రౌడీలు ఆయన్ను తీవ్రంగా గాయపరిచి వెనుతిరిగి చూసుకుంటూ వెళ్తోండగా… గాయాల నొప్పి భరిస్తూనే శ్రీకాంత్ ఉక్రోషంగా చూస్తున్న సీన్ హైలెట్ గా నిలిచింది.
ఈ టీజర్ శ్రీకాంత్ కెరీరలోనే మైలురాయిగా నిలిచిన ఆపరేషన్ దుర్యోధన సినిమాను గుర్తుకు తెస్తోంది. ఆ సినిమాలోలానే ఆపరేషన్ 2019లో కూడా శ్రీకాంత్ రాజకీయనాయకుడి క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణం బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో ఆపరేషన్ 2019 రిలీజ్ కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్ శనివారం టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.