5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చే ఆలోచనలో చైనా మొబైల్ సంస్థ ఒప్పో ప్రకటించింది. 5జీ రేసులోకి దూసుకోస్తూ క్వాల్ కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5జి ఫోన్‌ను ఏడాది చివరి నాటికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. మార్కెట్లలో ఎక్కువమంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని డ్యూయల్ మోడ్ 5జీ డివైస్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అందిస్తుందనని సైంటిస్ట్ హెన్రీ టాంగ్ తెలియ చేశారు.
స్టాండ్‌లోన్, నాన్ స్టాండలోన్ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తూ భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్ గురించి తెలియ చేశారు. క్వాల్కమ్ 5జీ సమ్మిట్ 2019 బార్సిలోనాలో జరిగిన నేపథ్యం లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ మాట్లాడారు. సైంటిస్ట్ హెన్రీ టాంగ్ తెలియచేసిన వివరాల ప్రకారం డ్యూయల్ మోడ్‌తో ఒప్పో కొత్త 5జీ మొబైల్ రానుంది.