పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. రాజ్యాంగ నిబందనలను అది ఉల్లంఘిస్తోందని బిహార్‌లోని కిషన్‌గంజ్ కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్, ఎంఐఎం అధ్యక్షుడు-హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని.. వారి మతపరమైన స్వేచ్ఛను అడ్డుకునేలా ఉందని.. వక్ఫ్ ఆస్తులు, నిర్వహణపై నియంత్రణ విధిస్తోందని జావేద్ తరఫు న్యాయవాది అనాస్ తన్వీర్ పేర్కొన్నారు.