ఓ ఎద్దు బంగారాన్ని తిన్న ఘటన హరియాణాలోని సిర్సాలో చోటు చేసుకుంది. సిర్సాలో జనక్ రాజ్ అని ఒక వ్యక్తి తన భార్య, కోడలు వంట గదిలో ఓ గిన్నెలో వారి నగలను భద్రపర్చారు. తరిగిన కూరగాయల చెత్తను అనుకోకుండా మరిచిపోయి అదే గిన్నెలో వేయడం జరిగినది. వారి నగలను అదే గిన్నెలో ఉన్న విషయం మరిచి పోయారు. కూరగాయల చెత్తతో కలిపి బయట పడేసిన బంగారాన్ని కనిపెట్టడానికి సీసీ కెమెరాలో పరిశీలించగా ఒక ఎద్దు పడవేసిన చెత్తను తిన్నట్టు తెలుకున్నారు. 40 గ్రాముల బంగారం ఆ గిన్నెలో ఉన్నట్టు బాదితులు తెలిపారు.
సీసీ కెమెరా ద్వారా చెత్త తిన్న ఎద్దును వెదికి పట్టుకొని, వెటర్నరీ డాక్టర్ని పిలిపించగ తర్వత ఎద్దును వారి ఇంటి వద్దనే కట్టివేసి మేత పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎద్దు పేడ ద్వారా వారి బంగారం బయటకు రావాలని జనక రాజ్ కుటుంబ సభ్యుల అనుకుంటున్నారు. దాని పేడ ద్వారా వారి బంగారం బయటకు రాక పోతే ఎద్దును గోశాలకు అప్పగించే ప్రయత్నం చేస్తాం అని చెప్పారు.