తెలంగాణా రాజకీయాలు పూటకో మలుపు తిరిగుతున్నాయి. నిన్న ఉదయంకాంగ్రెస్ ను కాదనుకుని జేపీలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సతీమణి పద్మినీ రెడ్డి, మళ్ళీ మనసు మార్చుకుని వెనక్కి వచ్చేశారు. నిన్న ఉదయమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కాషాయం పార్టీలో చేరిన ఆమె కేవలం గంటల వ్యవధిలో పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు భారీ షాక్‌కు గురికాగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదన చూడలేకే బీజేపీ నుంచి గంటల వ్యవధిలోనే తప్పుకుంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అందుకే ఇక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లు పద్మినీ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతలా స్పందన వస్తుందని ఊహించలేకపోయానని, కానే కార్యకర్తల భావన, మనోవేదన చూసాక మనసు మార్చుకున్నట్లు చెప్పారు. అనుకోకుండా తాను తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అంతలా బాధిస్తుందని అనుకోలేదన్నారు.