స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన పాక్ క్రికెటర్ షార్జీల్ ఖాన్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు. షార్జిల్ ఖాన్‌కు పీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్ ముందు హాజరవ్వగా అతనికి క్లియరెన్స్ దొరికింది. దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి రాగానే త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో షార్జీల్ ఖాన్ ఆడ నున్నాడు. కాగా పీఎస్ఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్ లో షార్జిల్ పేరు నమోదు కానుంది.
పీఎస్ఎల్ రెండో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడగా పీసీబీ షార్జీల్ ఖాన్‌పై ఐదు ఏళ్ల నిషేధం పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తనను క్షమించాలంటూ పీసీబీకి విన్నవించుకున్న షార్జిల్కి అతనిపై ఉన్న నిషేధాన్ని మూడేళ్లు తగ్గించగ ఇపుడు క్రికెట్ లో చోటు తక్కినది. నిషేధం ముగిసిన తర్వాత తన కెరీర్‌ను షార్జీల్ ఖాన్ తిరిగి త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో మొదలుపెట్టనున్నాడు. గతంలో 25 వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు పాకిస్తాన్ తరఫున క్రికెటర్ షార్జీల్ ఖాన్ ఆడారు.