షెహజాద్ అహ్మద్ బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు యత్నించి మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు. ఫైసలా బాద్‌లో సింధ్‌తో మ్యాచ్ రెండో రోజు జరగనున్న మ్యాచ్ లో ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్ళీ కష్టాల్లో పడ్డాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో సెంట్రల్ పంజాబ్‌కు కెప్టెన్‌గా అజామ్ వ్యవహరిస్తున్నాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
ఇది వరకి యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్రమించించినందుకు నాలుగు నెలల పాటు నిషేధానికి 2018లో గురయ్యాడు. ఇపుడు నియమాలను పాటించక ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు ఫీల్డ్ అంపైర్లు రిఫరీ నదీమ్ దృష్టికి తీసుకెళ్లడంతో చిక్కుల్లో పడ్డాడు.
కోచ్ మిస్బావుల్ హక్ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏమేరకు చర్యలు తీసుకోబోతుందో చూడాలి. షెహజాద్ అహ్మద్ సస్పెన్షన్ నుండి బయట పడ్డాక రీ ఎంట్రీ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఇచ్చాడు. ఇపుడు ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు విమర్శల పాలవుతున్నాడు.