నియంత్రణ మండలి(బీసీసీఐ)పై పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. ప్రస్తుతం క్రికెట్‌ను డబ్బే శాసిస్తోందని, ఆటగాళ్లనే కాకుండా క్రికెట్ బోర్డులను సైతం డబ్బే నడిపిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐయేనని, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి 90 శాతం నిధులు భారత దేశమే సమకూరుస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ బోర్డు అంత ధనికమైంది కాబట్టే.. ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చేస్తుందని తెలిపాడు. క్రికెట్లో డబ్బంతా భారత్‌లోనే ఉందని, అందుకే క్రికెటర్లయినా, క్రికెట్ బోర్డులైనా బీసీసీఐకి దాసోహమంటారని ఐపీఎల్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు.
పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు అర్ధంతరంగా తప్పుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పాక్ లాంటి చిన్న దేశాలతో ఆడుతూ.. ప్రపంచ క్రికెట్‌ను ఏదో ఉద్దరిస్తున్నామని కివీస్, ఇంగ్లండ్ జట్లు భావిస్తున్నాయని, పాక్ విషయంలో వ్యవహరించినట్లు భారత్‌తో చేసేందుకు ఏ దేశాలు సాహసం చేయలేయని అన్నారు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ సభ్య దేశాలన్ని భారత్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు డబ్బే కారణమని భారత్ పట్ల అతనికున్న వ్యతిరేక భావన్ని మరోసారి వ్యక్తపరిచాడు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బీసీసీఐ నికర విలువ రూ.14,489 కోట్లుగా ఉందని, ఇంత డబ్బున్న క్రికెట్ బోర్డును ఏ దేశమైన వ్యతిరేకించేందుకు సాహసించదని పేర్కొన్నాడు.