పాకిస్తాన్ జట్టుకు ఆసియా కప్ మరియు వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లకు ముందు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ను పాకిస్తాన్ స్టార్ బౌలర్ వాహబ్ రియాజ్ ప్రకటించారు. ఈ మేరకు కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్. రియాజ్ పాకిస్తాన్ తరపున 2011, 2017 మరియు 2019 వరల్డ్ కప్ లలో ప్రాతినిధ్యం వహించాడు.
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ రియాజ్ మొత్తంగా 27 టెస్టులు, 91 డేలు మరియు 36 t20 మ్యాచ్ లు ఆడాడు .ఈ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ ఇక ఓవరాల్ గా 237 వికెట్లు పడగొట్టాడు . ఇక రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాట్లాడుతూ “నేను గత రెండు సంవత్సరాలుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని,నా దేశం తరఫున శక్తి వంచన గా ఆడానని ,ఇక అన్ని ఫార్మాట్లో నుంచి తప్పుకుంటున్నానుని” రియాజ్ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్, ఈనెల చివరి నుంచి ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ రియాజ్ రిటైర్మెంట్ ప్రకటన… ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.