Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ సైన్యం మరోసారి తన దుర్మార్గాన్ని ప్రదర్శించింది. నియంత్రణరేఖ వెంబడి రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టర్ వద్ద ఐదుగురు భారత జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని రీతిలో పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ 400 మీటర్ల సరిహద్దు దాటేసి భారత సైనికుల వైపు దూసుకొచ్చింది. పాక్ సైన్యం వెంట ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వారంతా కలిసి భారత సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఆపై దారుణమైన చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. భారత జవాన్లు మరణించిన తర్వాత కూడా పాక్ సైన్యం కసి చల్లారలేదు. అత్యంత పైశాచికంగా మన జవాన్ల మృతదేహాలను ముక్కలు ముక్కులుగా నరికి, అక్కడే వదిలేసి వెనక్కి వెళ్లిపోయింది. పాక్ సైన్యం దాడిలో తీవ్ర గాయాలతో తప్పించుకున్న మరో జవాన్ ఈ దారుణ సంగతులు వెల్లడించారు. ఇప్పుడాయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమరులైన సైనికులను 32 ఏళ్ల మేజర్ మోహకార్ ప్రఫుల్లా అంబాదాస్, 34 ఏళ్ల లాన్స్ నాయక్ గుర్మెయిల్ సింగ్, 30 ఏళ్ల లాన్స్ నాయక్ కులదీప్ సింగ్, 30 ఏళ్ల సిపాయి పర్ గత్ సింగ్ గా గుర్తించారు.