‘పంతం’ మూవీ రివ్యూ… తెలుగు బులెట్

Pantham Movie Review

నటీనటులు : గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, శ్రీనివాస రెడ్డి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు
మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌,
డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి,
స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌),
సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌,
నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌,
స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

లౌక్యం సినిమా తర్వాత చాలా సినిమాలు చేసినా గోపీచాంద్ సరయిన హిట్ కొట్టలేకపోయాడు. తాజాగా మేహ్రీన్ జంటగా జైలవకుశ, బలుపు సినిమాలకి అసోసియేట్ గా పనిచేసిన చక్రవర్తి దర్శకుడిగా వచ్చిన పంతం సినిమా రిలీజ్ అయ్యింది. ముందు నుండీ ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. అలాగే సినిమా ట్రైలర్, టీజర్లు కూడా అదే రాపో కనబరచడంతో సినిమా మీద మరింత ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. అయితే ప్రేక్షకులు పంతం మీద పెట్టుకున్న అంచనాలని గోపీచంద్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

గోపీచంద్ పంతం పట్టడానికి కారణం ఏంటంటే : :

విక్రాంత్ సురానా (గోపీచంద్ ) త‌న గ్యాంగ్‌తో క‌లిసి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాలు చేస్తాడు. రాష్ట్రానికి హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్‌), హెల్త్ మినిస్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి)లతో పాటు అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్ళల్లో బ్లాక్ మనీ కొట్టేస్తాడు. ఈ క్ర‌మంలోనే హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర కి సంబంధించి ఓసారి రైలు భోగీ నుంచి, ఇంకోసారి మినిస్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు ఇలా కొట్టేస్తూ ఉండగా ఒకానొక సమయంలో దొరికిపోతాడు. ఈ గ్యాంగ్‌ను లీడ్ చేస్తోంది విక్రాంత్ అని తెలుసుకున్న మినిస్ట‌ర్ నాయ‌క్‌ అత‌డి గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్ట‌ర్ డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అస‌లు విక్రాంత్ ఇలా రాజ‌కీయ నాయ‌కులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అసలు సురానా ఎవరు ? దోచిన డబ్బును ఏమి చేస్తున్నాడు ? అనేదే సినిమా కధ.

నోట్ : నిజానికి చెప్పుకోడానికి ఇదేమీ కొత్త కధ కాదు అని హీరోచేతే చెప్పించాడు దర్శకుడు.

‘పంతం’ పట్టారా ? లేదా ?

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించే ఎక్స్ గ్రేషియా చుట్టూనే ఈ కధ మొత్తం రాసుకున్నారు. అసలు ఎక్స్ గ్రేషియా నిజంగా ఎంత మంది బాధితులకు చేరుతుంది. మధ్య మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎంత తింటున్నారు అన్న పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ యాడ్ చేసి లవ్ యాంగిల్ మిక్స్ చేసి తెరకెక్కిం‍చాడు దర్శకుడు చక్రవర్తి. గోపిచంద్‌ మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు వరుస యాక్షన్‌ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. విలన్‌ క్యారెక్టర్‌ను మరింత బలంగా చూపించి ఉండచ్చు. పాటలు స్పీడ్‌ బ్రేకర్లలా ఇబ్బంది పెడతాయి. ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తొలి సినిమాకు కొత్త స‌బ్జెక్ట్ కాకుండా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను మెసేజ్ మిక్స్ చేసి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే సెకండాఫ్‌లో ఉన్న డెప్త్ ఫ‌స్టాఫ్‌లో తేలిపోయింది. ఇది వ‌ర‌కు చూసిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ అయినా ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న మెసేజ్ అందిరికీ నచ్చుతుంది. ర‌మేశ్ రెడ్డి రాసిన కోర్టు సీన్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్‌గా ఉంది. ప్ర‌తి సీన్ లావిష్ గా తెర‌పై ఆవిష్క‌రించారు. గోపీ సుంద‌ర్ ఆరార్ బాగుందికానీ పాట‌లు అస్సలు నప్పవు. పాతతరం రాబిన్ హుడ్ కాన్సెప్ట్ ఏ అయినా కదా కధనాల వల్ల ప్రేక్షకులకి నచ్చుతుంది. నిర్మాణ విలువ‌లు సినిమా రేంజ్ ని పెంచేశాయి.

పంతం పట్టిన గోపీచంద్ మెప్పించాడా ?

ఆకలి మీద ఉన్నవారికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికినట్టు చాన్నాళ్ళ నుండి హిట్ కోసం పరితపిస్తున్న గోపీచంద్ కి చాలా రోజుల త‌ర్వాత పంతం రూపంలో మంచి సినిమా వ‌చ్చింది. మంచి సోష‌ల్ మెసేజ్‌తో ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. కొన్ని విసుగు పుట్టించే సీన్లు ఉన్నా కామెడీ, యాక్ష‌న్‌, సోష‌ల్ మెసేజ్‌, పొలిటిక‌ల్ యాంగిల్స్ ఇలా కోణాలు సినిమాను నిల‌బెట్టాయి. గోపీచంద్ నటన విషయానికి వస్తే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్ష‌న్ సీన్ల‌లోనూ, డైలాగ్ డెలివ‌రీలోనూ గోపీచంద్ న‌ట‌న సినిమాకు హైలెట్‌. గోపీ ఎమోషనల్ గా కోర్టు సీన్ డైలాగ్స్ చెబుతుంటే అవి ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తాయి. ఇక మెహ‌రీన్ పాత్ర పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. గ్లామరస్ రోల్ లో ఫరవాలేదనిపించింది. సెకండాఫ్‌లో పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. ఇక ఫ‌స్టాఫ్ అంతా పృథ్వీ త‌న‌దైన కామెడీతో న‌వ్వించాడు. అయితే ఈ పాత్ర‌కు కూడా పెద్ద ప్రాధాన్య‌త ఉండ‌దు. కామెడీ ఉద్దేశంగానే పాత్ర ఉంటుంది. ఇక హీరో స్నేహితుడి పాత్ర‌లో శ్రీనివాస‌రెడ్డి పాత్ర ప‌రిధిమేర బాగా న‌టించాడు. రాళ్ళ‌ప‌ల్లి, అజ‌య్‌, హంసానందిని షాయాజీ షిండే లాంటి చాలామంది సీనియర్ న‌టీన‌టులు తమ తమ పాత్ర‌ల మేర చ‌క్క‌గా న‌టించారు.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : పంతం… చెప్పుకోడానికి ఇది కొత్త కధేమీ కాదు…
తెలుగు బులెట్ రేటింగ్ : 2.75 / 5