సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో రెండో సినిమా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇప్పటికే ఆది హీరోగా గాలిపటం సినిమాను నిర్మించిన సంపత్ నంది తాజాగా తన బ్యానర్లో రెండో సినిమాను సిద్ధం చేశాడు. తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్ బాయ్ సినిమాను తెరకెక్కించారు.
సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమాలో రియా సుమన్, తాన్యా హోప్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. కెమెరా సౌందర్య రాజన్, భీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటాయని యూనిట్ చెబుతోంది. జయశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్ఎన్ సినిమాపై సంపత్ నంది నిర్మించారు.
ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది.. అది కనిపించదు – కానీ బతికిస్తుంది, మా ఇద్దరికీ పరిచమైంది పుస్తకాల్లో… దగ్గరైంది అక్షరాల్లో లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయనిపిస్తోంది. ముద్దు పెట్టుకోవడమంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం లాంటి డైలాగ్స్ కి యూత్ కనెక్ట్ అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.