నటీనటులు:సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి, సన్నీ, మహేష్ మిట్ట, రాజశ్రీ తదితరులు
సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్
మ్యూజిక్: బీమ్స్
ఆర్ట్: రాజీవ్
ఎడిటర్: తమ్మి రాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి మామిళ్ల
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి
ఫైట్స్: రాము సుందర్
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
కథ -స్క్రీన్ ప్లే- మాటలు: సంపత్ నంది
డైరెక్టర్: జయశంకర్.
సంపత్ నంది రచించి, స్క్రీన్ ప్లే అందించిన చిత్రం పేపర్ బాయ్, వర్షం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా, అప్పట్లో ఒకడుండేవాడు ఫేం తాన్యా హాప్, రియా సుమన్ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పేపర్ బాయ్..రవితేజ, రాం చరణ్, గోపీ చాంద్ లాంటి సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది స్వయంగా కదా అందించి తానే ప్రోడ్యుస్ చేయడంతో, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఈ చిత్ర ట్రైలర్ ను ప్రోమోట్ చేయడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో తెలియాలంటే పూర్తి సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కధ :
ముంబయిలో మొదలవుతుంది కధ, తన నిశ్చితార్ధం రోజున తనకు ప్రాణాంతక వ్యాధి ఉందని తెలుసుకున్న మేఘ(తాన్యా హోప్) తన జీవితానికి ఉన్న పరమార్ధం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ సమయంలో ఒక డైరీ ఆమెకు దొరుకుతుంది. ఆమె ఆ డైరీ చదవడం మొదలు పెడుతుంది, అదే పేపర్ బాయ్ కధ. బీటెక్ చదివి ఖాళీగా ఉండలేక పేపర్ వేస్తూ ఉద్యోగానికి ట్రయల్స్ వేస్తుంటాడు రవి(సంతోష్ శోభన్), ఇతనికి సాహిత్యమంటే పిచ్చి, తనలాగే సాహిత్యమంటే పిచ్చి ఉన్న గద్వాల్ రెడ్డి(కొటీస్వరుడయిన ప్రొఫెసర్) కూతురు ధరణి(రియా సుమన్) ను మొహం చూడకుండానే ప్రేమలో పడతాడు. ఆమె నాలుగేళ్ల తర్వాత ఇంటికోచ్చిందని తెలుసుకుని మొత్తానికి ఎలాగోలా లవ్ లో పడతారు. కానీ పెళ్లి దాకా వెళ్ళే సరికి అంతస్తులు గుర్తొస్తాయి. అయితే ఇళ్ళల్లో పెద్దల్ని ఒప్పించిన వారి పెళ్లి రేపే పెళ్లి అనగా ఆగిపోతుంది. ఆ పెళ్లి ఎందుకు ఆగింది ? దానికి కారణం ఎవరు ? మళ్ళీ వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా ? అనే విషయాలు తెర మీద చూడాల్సిందే
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో ఎన్ని వైవిధ్యభరిత సినిమాలు వస్తున్నా పాత రొటీన్ ఫార్ములలను కూడా దర్శకులు వదిలిపెట్టడంలేదు. అనలా వచ్చిన సినిమానే పేపర్ బాయ్. ఒక పేద అబ్బాయి, ఒక డబ్బున్న అమ్మాయి ప్రేమలో పడటం విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లి ఆమె తండ్రో, అన్నయ్యో హీరోని చంపించడానికి ప్రయత్నించడం ఆ తర్వాత క్లైమాక్స్ కి అందరూ కలిసి పోవడం ఈ ఫార్మాట్ సినిమాలు కొన్ని వందలు వచ్చి ఉంటాయి తెలుగులో. వాటిలో ప్రమాణాలతో తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంపత్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోయి ఉంటాడనిపించింది. అయితే ఇదే లైన్ తో దాదాపు ఎన్నో వందల సినిమాలు వచ్చినా ఈ సినిమాను కొత్తగా నేరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
సంతోష్ శోభన్ కు మొదటి సినిమా అయినా ఈజ్ తోనే నటించాడు. ఇక నటనకు ప్రాధ్యనమున్న పాత్రలో రియా జీవించింది. తాన్యా హాప్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక గద్వాల్ రెడ్డి క్యారెక్టర్ మనకు సుపరిచితమయిన ఒక విలన్ గ్యాంగ్ ఆర్టిస్ట్ తో చేయించడం బాగుంది. ఇక విద్యుల్లేఖా రామన్, బిత్తిరి సత్తి మధ్య వచ్చే కామెడీ చిత్రానికి ప్లస్, సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. మ్యూజిక్ సోసో గా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం రచ్చ లేపింది. మహేశ్ విట్ట, RX 100 లక్ష్మన్ లాంటి వాళ్ళని దర్శకుడు సరిగా వాడలేదేమో అనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత సమయం వెచ్చించి ఉంటె బాగుండేది.
మొత్తానికి ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే యూత్ లో ప్రతి ఒక్కడు లవ్ లో ఉన్న ప్రతి ఒక్కడు తమను తాము ఓన్ చేసుకుని సినిమా చూస్తారు, ఎందుకంటే ఎవడికాడు ప్రపంచంలో మనకంటే నిజాయితీ కలిగిన ప్రేమ ఇంకెక్కడా ఉండదని ఫీలవుతాడు కాబట్టి.